ఇంటి జాగాతోనే ఆత్మగౌరవం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య
వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : ప్రతి పేదవాడి కళ ఇంటి స్థలం రావడం ద్వారానే నెరవేరుతుందని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి నాగయ్య అన్నారు. ఆదివారం గోవిందరావుపేట మండలం పసరలో ఇంటి స్థలాలు పోరాటం చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం తీగల ఆగి రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాగయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి స్థలం డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిన హామీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న పేదవాడికి అంటే స్థలం లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తే ముదిగొండలో కాల్పులు జరిపి ముగ్గురుని మట్టున పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఈ పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన అంటిస్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులను కలిసి ఈ సమస్యను విన్నవించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామని ప్రజలు ఇంటి స్థలాలు సాధించుకునే అంతవరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, చిట్టిబాబు, అంబాల పోషాలు, రమేష్ ,ఉపేంద్ర చారి, రాజు, రాజేశ్వరి, శారద ,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.