కోల ఆదిత్య స్మృతిలో సేవా కార్యక్రమాలు

కోల ఆదిత్య స్మృతిలో సేవా కార్యక్రమాలు

తిమ్మాపూర్, జూలై 14 (విశ్వం న్యూస్) : ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి, లావణ్య దంపతుల కుమారుడు కోల ఆదిత్య స్మృతిలో సోమవారం కరీంనగర్‌ నగరంలో మూడు విభిన్న స్థలాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సివిల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తూ, మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోల ఆదిత్య అకాల మరణం చెందారు.

బొమ్మకల్ సెంటర్ లైటింగ్ సమీపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, చింతల కిషన్ పటేల్, బట్టు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం
లయన్స్ జిల్లా 320-జి ఆధ్వర్యంలో మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవి కంటి కృష్ణ కిషోర్, భాగ్యలక్ష్మి, బద్దం మల్లారెడ్డి, లంబు రాజిరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో కూడా అన్నదానం జరిగింది. ఇందులో ముక్క శరత్ కృష్ణ, శివకాంత్, బట్టు వినోద్, పెద్ది విద్యాసాగర్, కొండ రాంబాబు, ఎలగందుల మునీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *