ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. భార్య ఆత్మహత్య

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. భార్య ఆత్మహత్య

  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గర్ల్ ప్రేమలో వైద్యుడి మోహం… భార్య ఆత్మహత్యకు దారితీసిన విపరీత ప్రేమ

హన్మకొండ, జూలై 14 (విశ్వం న్యూస్):హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో ఓ వైద్య దంపతుల కుటుంబంలో సోషల్‌మీడియా కారణంగా విషాదం నెలకొంది. స్థానికంగా నివసించే కార్డియాలజీ డాక్టర్ సృజన్‌కి 2017లో డాక్టర్ ప్రత్యూషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల డాక్టర్ సృజన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ‘బుట్ట బొమ్మ’గా పాపులర్ అయిన రీల్స్ గర్ల్ శృతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే సమయంలో భార్య ప్రత్యూషతో దూరం పెరిగింది. భార్యను పట్టించుకోకుండా శృతితో గడిపే సమయం పెరిగిందని బాధపడిన ప్రత్యూష తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

తన జీవిత భాగస్వామి మారిపోతున్నాడనే నిస్సహాయతతో డాక్టర్ ప్రత్యూష తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం డాక్టర్ ప్రత్యూష తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హసన్‌పర్తి పోలీసులు, నిందితుడైన డాక్టర్ సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, అతను తన కూతురిని కూడా హింసించాడని ఆరోపించారు.

ఈ విషాద సంఘటన ప్రస్తుత సోషల్‌మీడియా కాలంలో యువత తేలికగా తీసుకుంటున్న సంబంధాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. రెక్కలు వచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛకు రేఖలు అవసరమనే వాస్తవాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *