హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విశ్వం న్యూస్) : భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల సమయంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదలో రాణి గారు (ఖమ్మం), వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించదు.
మధిర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్లని రప్పించి వారే ప్రాణాలు కాపాడుకోవాలి. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే.. ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణాలను కాపాడాలి. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారు”.
” ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేస్తారు. ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజాసమస్యలు ఎత్తిచూపినా స్పందించరు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీచార్జీలతో వారిని హింసిస్తారా?. సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు” అంటూ కేటీఆర్ మండిపడ్డారు.