రోడ్డు ప్రమాదంలో
ఎస్ఐ శ్వేత మృతి

జగిత్యాల, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్ క్వార్టర్స్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి చెందాడు.