జన్మదిన వేడుకల్లో సిద్ధప్పకు ఘన సన్మానం

మణికొండ, జూలై 16: గౌరవనీయులైన కోఆప్షన్ సభ్యుడు సిద్ధప్ప జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ వడ్డెర సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రటరీ ఎం. శివయ్యతో పాటు పుల్లెపు గిరి, దండుగల మల్లేష్ మరియు ఇతర వడ్డెర సంఘం సభ్యులు హాజరై సిద్ధప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. సిద్ధప్ప ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.