నేటి సమాజంలో సోషల్ మీడియా అంతర్భాగం

నేటి సమాజంలో సోషల్
మీడియా అంతర్భాగం

సోషల్ మీడియా సంగమంలో వక్తల ప్రసంగం
తిమ్మాపూర్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : ప్రపంచంలోనే దీటైన శక్తిగా మారుతున్న భారత దేశ విషయాలను సోషల్ మీడియా వేదికగా చాటి చెప్పాలి. సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రధాన వక్తలు అయిన సురేష్ కొచ్చటిల్, కుంటి సురేందర్, బూర్ల దక్షిణామూర్తి లు మాట్లాడుతూ…
ఆధునిక సమాజంలో సోషల్ మీడియా అంతర్భా గంగా మారిందని, సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉందని, అందుకే సమాజ పరి వర్తన, జాతీయ భావజాల వ్యాప్తి కొరకు యువత, సోషల్ మీడియాకు సైనికులుగా నడుం బిగించాలని సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్, రిథమ్ డిజిటల్ తెలుగు రీజినల్ ఎడిటర్ కుంటి సురేందర్ , ఆర్.ఎస్. ఎస్ బాధ్యులు బూర్ల దక్షిణామూర్తిలు అన్నారు.

సమాచార భారతి ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ లోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ కళాశాలలో సోషల్ మీడియా సంగమం కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి ప్రధాన వక్తలుగా హాజరైన వారు మాట్లాడు తూ.. ముఖ్యంగా సోషల్ మీడియా యువత జీవితా లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, సోష ల్ మీడియా ఒకరితో ఒకరు సంభాషించుకునే విధా నాన్ని మార్చిందని, ముఖ్యంగా ఫేస్బుక్ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ లాంటి ప్లాట్ ఫామ్ లు ప్రపంచంలోని ఏ విషయాన్ని అయినా చుట్టే విధంగా చేశాయన్నారు. సోషల్ మీడియా చాలా ప్రయోజనా లను అందించగలదని, అలాంటి సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే సత్ఫలితాలు అందుకోగలుగుతామన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ చారిత్రక నిర్ణయాలతో ప్రపంచంలోనే నేడు భారతదేశం బలమైన శక్తిగా మారిందని, రక్షణ రంగం, ఆత్మ నిర్భరభారత్, మేకిన్ ఇండియా, 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్, డిజిటల్ లావాదేవీలు, రామ మందిరం నిర్మాణం లాంటి అనేక అంశాలు సాహసో పేతమైనవని, ఇలాంటి విషయాలను సోషల్ మీడి యా వేదిక ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా దేశ, ధర్మ రక్షణకు, దేశానికి సేవ చేసిన మహనీయుల చరిత్రను తెలియజే యడానికి, జాతీయ భావజాల వ్యాప్తికి కృషి చేయా ల్సిన అంశంపై యువతరం దృష్టి సారించాలన్నారు.

సమాజానికి అవసరమైన వార్తలను సమాచారాన్ని అందించడానికి, దేశ కీర్తిని, గౌరవాన్ని పెంచే అంశాల ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియ జేసేలా సోషల్ మీడియా సైనికులు నిరంతరం కృషి చేయాలన్నారు. స్వరాజ్ టు స్వాభిమాన్ థీమ్ ఆఫ్ ది ఈవెంట్ గా సమాచార భారతి ఆధ్వర్యంలో సమాజ పరివర్తన, జాతీయ భావజాల విస్తరణ కొరకు నేటి యువతరానికి అవగాహన కల్పించ డానికి సోషల్ మీడియా సంగమం లాంటి కార్యక్ర మం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్ఎస్ఎస్ కరీంనగర్ సహా సంఘ చాలక్ ఎలగందుల సత్యనారాయణ, నిర్వహకులు తడిగొ ప్పుల శంకరయ్య, కట్ట వేణుగోపాల్, రాజుకుమార్, సాయి కిరణ్, విమల్ కుమార్, అనిల్ కుమార్, సుదా వైష్ణవి, సునీత పురాణం రాము, గీకురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *