పేద ప్రజలకు అండగా ఈటెల
సొంత కర్చులతో వైద్య సదుపాయం
వీణవంక, మే 31 (విశ్వం న్యూస్) : గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం, ఇతర కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ, ఏదైనా అనారోగ్యం సంభవిస్తే పట్టణాలలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే స్థోమత లేక నిస్సహాయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్న హుజూరాబాద్ నియోజక వర్గంలోని ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ వారి సొంత కర్చులతో ఈ రోజు వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ప్రజలను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు అందించి ఉచితంగా భోజనం, మందులు కూడా అందించి వారిని తిరిగి ఇంటివద్ద దింపే కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ కు, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డికి కొర్కల్ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.