స్పౌజ్ ​బదిలీలు లేక సతమతం

స్పౌజ్ ​బదిలీలు లేక సతమతం

  • హనుమకొండ నుంచి
    తరలిన స్పౌజ్ బాధితులు

హనుమకొండ, జూలై 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా కొనసాగుతున్న స్పౌజ్ బదిలీలను వెంటనే పూర్తి చేయాలని బాధిత ఉపాధ్యాయులు కోరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గల ఇందిరా పార్క్ వద్ద సోమవారం నిర్వహించిన స్పౌజ్ బాధితుల ఆవేదన సభకు పలువురు బాధిత ఉపాధ్యాయులు హనుమకొండ నుంచి తరలివెళ్లారు.

ఈ సందర్భంగా పలువురు మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం కేసిఆర్ మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులను కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగిలిన 13 జిల్లాలో వందల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తూ తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నామని స్పౌజ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వృద్ధులైన తల్లిదండ్రులను, పిల్లలను సరిగా చూసుకోలేని స్థితిలో అప్ అండ్ డౌన్ చేస్తూ నరకయాతనకు గురవుతున్నామని మహిళా ఉపాధ్యాయులు కన్నీళ్ళపర్యంతమైనారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్పౌజ్ బాధితులు ఎదుర్కొంటున్న బాధలను అర్థం చేసుకుని వెంటనే స్పౌజ్ బదిలీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకునేలా సీఎం కేసిఆర్ ను ఒప్పించాలని పలువురు బాధిత ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *