
- స్వామి వారి ఆశీస్సులతో రాజకీయ
ప్రవేశం చేస్తున్న పాడి ఉదయ్

ఇల్లందకుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా ఇల్లంద కుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు కనివిని ఎరగని రీతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘసంస్కర్త, మృదుస్వభావి, మంచికి మారుపేరు, క్రమశిక్షణకు మరోపేరు కలిగిన వ్యక్తిగా హూజురాబాద్ నియోజకవర్గ పరిధిలో నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం రాజకీయ ప్రవేశం చేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి హాజరై చంద్రరథంపైన ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పాడి ఉదయానంద రెడ్డి మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ మూర్తి, ఆంజనేయస్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగిందని, వారి అనుగ్రహంతో హుజురాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి నుంచి ఒక చిరునవ్వు చూడడానికి రాజకీయ ప్రవేశం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు,అయగార్లు, పలు పార్టీల నేతలు కార్యకర్తలు భక్తులు తదితరులు హాజరయ్యారు.
