ఇక నైనా నీ చెత్తపలుకులు ఆపు…

  • స్వచ్ఛంద కార్యకర్తలే బీఆర్ఎస్ బలం
  • పేయిడ్ సోషల్ మీడియా
    అవసరమే లేదు

హైదరాబాద్‌, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీకి పేయిడ్ సోషల్ మీడియా అవసరం లేదని పార్టీ మద్దతుదారులు స్పష్టం చేశారు. ఉద్యమ కాలం నుంచే టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, వ్యతిరేక ప్రచారానికి ధీటైన బదులులిచ్చిన చరిత్రను కలిగి ఉన్నారని వారు అన్నారు.

ఉద్యమ సమయంలో సమర్థవంతమైన ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మద్దతు లేకున్నా, టీఆర్ఎస్ కార్యకర్తలు తమ అద్భుతమైన సమాచార నైపుణ్యం, నాయకత్వంపై నమ్మకంతో, సోషల్ మీడియా వేదికలపై ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజా మద్దతును గెలుచుకున్నారని గుర్తు చేస్తున్నారు.

“ఉద్యమ సమయంలోను, తరువాతా కూడా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి నాయకులు సోషల్ మీడియా వేదికలపై ఎంతో చురుకుగా ఉన్నారు. పేయిడ్ ప్రచారాన్ని నమ్మని మా పార్టీ, నిజమైన కార్యకర్తల శక్తితోనే ముందడుగు వేసింది,” అని ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త అభిప్రాయపడ్డారు.

ఇటీవలి కాలంలో కొన్ని వర్గాలు బీఆర్ఎస్ సోషల్ మీడియా శక్తిని తక్కువచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇది రాజకీయ నిరాశకు నిదర్శనమని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. “విపక్షాల ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియాను ‘వేస్ట్’ అని అపహాస్యం చేయడం, వారి బలహీనతను స్పష్టంగా చాటుతోంది” అని వారు పేర్కొన్నారు.

ప్రజలతో నేరుగా కలవడానికి, నిజాలను వివరిస్తూ నిరంతరం స్పందించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆక్టివిస్టులు సోషల్ మీడియాను ఒక మాధ్యమంగా వినియోగించుకుంటున్నారని, ఇది ప్రచారానికి కాదు – అవగాహన కోసం మాత్రమేనని వారు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా శక్తిని తట్టుకోలేక చతికిల బడి చివరకు కాంగ్రేస్/టీడీపీ ఫేయిల్యూర్స్ ను కవరింగ్ చేసే పనిలో సోషల్ మీడియానే వేస్ట్ అనే స్థాయిలో నీ చెత్తపలుకు ఏదైతో ఉందో నీ ప్రస్టేషన్ కొట్టొచ్చినట్టు కనబడ్తుంది. దొంగదెబ్బలు, అబద్దపు ప్రచారాలు, విషపు రాతలు నీకు కొత్తకాదు..అంతకి మించి రివర్స్ కౌంటర్,నీ దిమ్మతిరిగేలా చేయటం మాకూ కొత్త కాదు. ఇక నైనా నీ చెత్తపలుకులు ఆపు జర..పరమ చెత్తగా ఉన్నయ్..చూడలేకపోతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *