విజయవంతమైన సిపిఆర్ శిక్షణ

విజయవంతమైన సిపిఆర్ శిక్షణ

రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొఫెసర్ డా.బంగారి స్వామి
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ , రెనే హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్వహించిన జాబ్ మేళా సిపిఆర్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ , కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ ఎల్. సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ఈ జాబ్ మేళాకు హాజరైన యువతకు, ఇతర ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో గుండె పోటు వచ్చినప్పుడు ఎలా కాపాడాలి అన్న అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ రెనే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డా.దీక్షిత్ బొజ్జ, ఎమర్జెన్సీ ఫిజీషియన్, పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ లతో సిపిఆర్ శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఏ విధంగా ఆపదలో ఉన్నవారిని కాపాడాలి అన్న విషయాన్ని ఆడియో వీడియోల ద్వారా వివరించారు.

ఈ సిపిఆర్ శిక్షణా కార్యక్రమం లో రెనే హాస్పిటల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.బంగారి స్వామి – రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ రెనే లో పూర్తి స్థాయి గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక పద్ధతుల ద్వారా చికిత్స అందించే సామర్థ్యం ఉందని తెలిపారు.

24 గంటలు ఎమర్జెన్సీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత అంబులెన్స్ పికప్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డా.దినకర్ తాటిమట్ల, డా. రాజా విజయేంద్ర రెడ్డి, సిటివిఎస్ సర్జన్ డా.యూసఫ్ మహమ్మద్ రఫీ, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా. రవీంద్రా చారి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి మల్లారెడ్డి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ రావు లతో పాటుగా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 120 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని దాదాపు వేయి ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమంలో రెనే హాస్పిటల్ నీ కూడా పాల్గొనేలా చేసిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రొఫెసర్ డా.బంగారి స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *