పత్తికి మద్దతు ధర కల్పించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్
పత్తికి మద్దతు ధర కల్పించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్

జిల్లాలోని పత్తి రైతులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్) నాయకులు కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు వినతి
ఆసిఫాబాద్, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : జిల్లాలోని పత్తి రైతులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్) నాయకులు కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు వినతి పత్రం ఇచ్చారు. పత్తికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రారంభంలో పత్తి క్వింటాలు కు సుమారుగా రూ. 10 వేలు ఉండగా, ఇపుడు గణనీయంగా తగ్గి రూ. 7900కు చేరుకుందని తెలిపారు. దీనితో గత మూడు నెలలుగా పత్తి రైతులుమద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నారనీ రూ. 12,000 గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు టి. సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్. సతీష్, జిల్లా అధ్యక్షులు మహేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి రాజశేఖర్,కోశాధికారి గొడిసెల క్రిష్ణ మోహన్ గౌడ్, రవి, జలీల్ బెగ్ పాల్గొన్నారు.
