బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని
దీపిక అనుమానాస్పద మృతి


నిర్మల్, జూన్ 13 విశ్వంన్యూస్ : బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అడ్మినిస్ట్రేటివ్ భవనం బాత్రూమ్లో అపస్మారక స్థితిలో పడిఉన్న ఆమెను.. వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించారు.

అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని సంగారెడ్డి జిల్లా, కోటపల్లి మండలానికి చెందిన దీపికగా గుర్తించారు. ఆమె ఇవాళ ఉదయం ఫిజిక్స్ పరీక్ష రాసినట్లు అక్కడి అధ్యాపకులు చెబుతున్నారు. మృతికి సంబంధించిన పూర్తివివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.