స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో స్వేరోస్
ఇంటర్నేషనల్ విక్టరీ డే సంబరాలు
బోడుప్పల్, మే 25 (విశ్వం న్యూస్) : అతి చిన్న వయసులోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన గురు కుల పాఠశాల విద్యార్థులు మలావత్ పూర్ణ, సాదనపల్లి ఆనంద్ కుమార్ లు మే 25.2014న అప్పటి తెలంగాణ రాష్ట్ర గురుకులాల సీక్రెటరీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సహకారంతో ఈ పేదింటి దళిత గిరిజన బిడ్డలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.ఈ ప్రపంచంలో మేము ఎవరికంటే తక్కువ కాదని నిరూపించారు.
ఈ సాహస చిన్నారుల ను ఆదర్శంగా తీసుకుని గురువారం బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థులు బాలాపూర్ లోని ఎతైన దేవతల గుట్టను ఎక్కడం జరిగింది. ఆ చిన్నారుల సాహసాన్ని మరొక్క సారి గుర్తు చేసుకోని జై భీమ్,జై స్వెరోస్,జై ఆరెస్పి అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఎర్ర అశోక్ కుమార్, పృద్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.