జమ్మికుంట:తెలంగాణ వర్కింగ్
జర్నలిస్టుల రిలేనిరాహార దీక్ష
జమ్మికుంట, జూలై 12 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ హక్కుల సాధాన కోసం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు.
జర్నలిస్టులు రాత్రనకా పగలనకా కవరేజ్ నిమిత్తం శ్రమలకోర్చి తమ విధులు కొనసాగిస్తున్నామని తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులుగా ముఖ్య పాత్ర పోషించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించకపోవడం బాధాకరమైన విషయం అని అన్నారు.
తమ న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.