పీర్జాదిగూడలో ఇష్ట రాజ్యాంగ
జలమండలి అధికారుల తీరు
పీర్జాదిగూడ, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడెం మెయిన్ రోడ్ లో లీకేజ్ వాటర్ తో రోడ్ల పొడవునా ఏరులై పారుతున్న త్రాగునీరు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కాలనీలలో నూతన పైపులైను పనులు సరిగా సాగడం లేదని, ఆ నూతన త్రాగునీటి పైపులేన్ పనులు త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఎండాకాలం వచ్చింది, ఎండలు ఎక్కువయ్యాయి, నగరపాలక ప్రజలకు త్రాగునీరు అవసరం కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ చూసినా జలమండలి అధికారుల పనితీరుతో ఎక్కడపడితే అక్కడ లీకేజీ నీరు రోడ్లమీద ఏరులై పారుతుందని, వెంటనే జలమండలి అధికారులు, మున్సిపల్ అధికారులు తేర్కొని ఎక్కడైతే సర్వీసింగ్ వర్క్ చేస్తున్నారో వాటిని పగడ్బందీగా చేసి ఇప్పుడున్నటువంటి జనాభా ప్రకారం డ్రైనేజ్ పైపులు గాని త్రాగునీటి పైపులు గాని నూతన పైపులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా త్రాగునీటిని అందించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఎన్నో కాలనీలో నూతన త్రాగునీటి పైపులైన్ల పనులు నత్త నడకన నడుస్తున్నాయని, వాటిని కూడా త్వరగా పనులు చేపట్టి ప్రజలకు త్రాగునీరు అందించాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, జల మండలి కార్యాలయంను ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.