హంగు ఆర్భాటాలతో అబద్ధాలు చెప్పే బిఆర్ఎస్ ప్రభుత్వం

హంగు ఆర్భాటాలతో అబద్ధాలు
చెప్పే బిఆర్ఎస్ ప్రభుత్వం

  • ఎలగందుల ఖిల్లాను 9 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి.
  • కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ది పనులను నిర్లక్ష్యం చేస్తున్నబిఆర్ఎస్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

కరీంనగర్ బ్యూరో, జూన్ 27 (విశ్వం న్యూస్) : చారిత్రక ఎలగందుల ఖిల్లా ను మంగళవారం కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తేది.02-02- 2014 లో అప్పటి టూరిజం శాఖ మంత్రి చిరంజీవి గారి ద్వారా ఈ జిల్లా ఖ్యాతిని పెంచాలని, పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎలగందుల ఖిల్లాలో 5 కోట్ల కేంద్ర పర్యాటక నిధులతో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు హంగు ఆర్భాటాలతో అబద్ధాలు చెప్పే బిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించకపోవడంతో వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది.

పునర్వ్యవస్థీకరణ పునర్నిర్మాణం పేరుతో ప్రభుత్వ కట్టడాలను కూల్చితూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్న బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ఎలగందుల ఖిల్లాను 9 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాము. ఒకపక్క నీళ్ల పండుగను జరుపుకుంటూ ఖిల్లాకు వచ్చే సందర్శకులకు త్రాగునీటి సౌకర్యాన్ని విస్మరించినారు.

ఖిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తాం. చారిత్రక ఎలగందుల ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో స్థానిక పార్లమెంట్ సభ్యునికి, జిల్లా మంత్రికి సోయి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పనులపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న బిఆర్ఎస్, బిజెపి జిల్లా మంత్రికి పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న ఫామ్ హౌస్ పై ఉన్న శ్రద్ధ ఖిల్లా అభివృద్ధిపై లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడమే నా ఉద్దేశం, గ్రామస్తుల విజ్ఞప్తి మేరకే ఖిల్లాను సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో మోడల్ స్కూల్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *