కెసిఆర్ అండతోనే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు:ఈటల జమున

కెసిఆర్ అండతోనే కౌశిక్ రెడ్డి
పిచ్చి చేష్టలు:ఈటల జమున

హైదరాబాద్, జూన్ 27 (విశ్వం న్యూస్) : ఈటెల రాజేందర్ స్వగృహం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈటల రాజేందర్ సతీమణి జమున మాట్లాడుతూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని తెలిసిందన్నారు. కేసీఆర్ అండతోనే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నాడని మహిళలను కించపరుస్తున్నాడని జమున అన్నారు.

ఉద్యమకారులను కొట్టించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి అనర్హుడు అని తేలినప్పటికీ ఈటెల రాజేందర్ వల్లే ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తన మాట వివనని వారిని చంపించేందుకు కూడా వెనుకాడడం లేదని కేవలం ఈటల రాజేందర్ పేరు ఉందన్న కారణంగానే హుజురాబాద్ లో అమరవీరుల స్థూపాన్ని కూల్చి కొత్తది కట్టించారని అన్నారు.

ఈటలను లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఈ వ్యూహం రచించి ఉంటారని జమున అనుమానం వ్యక్తం చేశారు. తమను చంపితే చంపిస్తారు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలు తమ ఆయుధమైన ఓటుతో కేసీఆర్ ను భూస్థాపితం చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *