దారి బంధు సమస్యను
పరిష్కరించాలంటూ
కమిషనర్ కు వినతి పత్రం
బండ్లగూడ జాగీర్, జనవరి 2 (విశ్వం న్యూస్) : రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బైరగూడ నుంచి నార్సింగ్ వెళ్లే దారి ఆర్మీ వారు దారి బంధు చేయడానికి అన్ని గుంతలుగా రోడ్డు తోవడం జరిగింది. ఈ రోడ్డుకు సంబంధించి ఆర్మీ వాళ్లను అడుగుతే కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టుకొని కమిషనర్ గారి త్రోగా లెటర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు తలారి ప్రేమ్ కుమార్, ఏ బ్లాక్ అధ్యక్షులు డప్పు నవీన్ కుమార్, భోగాల శ్రీనివాస్, కొరివి గణేష్, విష్ణు, శంకర్, శివ, మక్బూల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.