జేపీసీ వేసేంతవరకుకాంగ్రెస్ పోరాటం
- బిజెపి ప్రభుత్వ పాలనలో న్యాయవ్యవస్థ, పార్లమెంటు వ్యవస్థ అణిచివేయబడుతున్నాయి.
- ప్రధాని, అదానీ మధ్య ఆర్థిక వ్యాపార సంబంధాలను బయటపెట్టినందుకే రాహుల్ గాంధీ గారిపై వేటు
- అదాని వ్యవహారంపై జేపీసీ వేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.
- పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్ 3 (విశ్వం న్యూస్) : నరేంద్ర మోడీ కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుండి బహిష్కరించడానికి ఖండిస్తూ, ఏఐసిసి, టిపిసిసి మరియు డిసిసి పిలుపుమేరకు నేడు చొప్పదండి కార్యాలయంలో వైద్యుల అంజన్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ దాదాపు తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో అటు న్యాయవ్యవస్థ, ఇటు పార్లమెంటు వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలను వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
పార్లమెంట్ విధానాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సమనత్వాన్ని స్వేచ్ఛను రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అణిచివేసైనా సరే అదానీని కాపాడాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ బిజెపి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. భారతదేశ విశిష్టతను ప్రాముఖ్యతను రాజ్యాంగ వ్యవస్థను, న్యాయవ్యవస్థను తుంగలో తొక్కుతున్నారు.
అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే గారి ప్రసంగాన్ని మరియు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి నరేంద్ర మోడీకి అదానీకి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆర్థిక, వ్యాపార వాణిజ్య సంబంధాలను ఆధారాలతో సహా ఫోటో క్లిప్పింగ్లు వీడియో క్లిప్పింగ్ లతో సహా బయటపెట్టిన రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని పార్లమెంటు రికార్డుల్లో లేకుండా చేశారు. అనంతరం సూరత్ కోర్టులో స్టే విధించబడి ఉన్న కేసును 24 గంటల్లో రీ ఓపెన్ చేసి రాహుల్ గాంధీ గారి శిక్షపడే విధంగా చేసినారని సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు.
రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యునిగా రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించినందుకు జైలుకు పంపి వారిని ప్రజలకు దూరం చేయాలని అనుకుంటే, భారత దేశ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఈ దేశ రక్షణ కోసం పార్లమెంటు లోపల ఉన్నా పార్లమెంటు నుండి నన్ను బహిష్కరించినా ప్రశ్నిస్తూనే ఉంటానని అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ వెనకడుగు వేసేది లేదని రాహుల్ గాంధీ గారు సమాధానం ఇవ్వడం జరిగింది.
రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినట్లుగా 23 వేల కోట్ల రూపాయల ఆదాని పెట్టుబడిలపై జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ వేయాల్సిందేనని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బోఫోర్స్ కుంభకోణంపై, కామన్వెల్ కుంభకోణంపై, 2జీ కుంభకోణంపై జాయింట్ యాక్షన్ పార్లమెంటరీ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగిందని దమ్ముంటే నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రధాని ఆర్థిక లావాదేవీలపై జేపీసీ వేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని లేదంటే రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని ఈ దేశానికి దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం కొనసాగుతుందని హెచ్చరించినారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరుపతి గౌడ్, కౌన్సిలర్లు కొట్టె అశోక్, పెరుమాండ్ల గంగయ్య గౌడ్, మాజీ మార్కెట్ ఛైర్మన్ పురం రాజేశం, మాజీ సర్పంచ్ మునిగాల సుధాకర్ గౌడ్, నాయకులు గుర్రం రమేష్ గౌడ్, కొత్తూరు మహేష్, మునిగాల రాజేందర్, గోల్లే సంపత్, పెద్ది రాజేందర్, ఈర్ల స్వామి, భీమయ్య, జాడి రాజు, సంబోజి సునీల్, నిజానపురం చందు, నల్లాల అఖిల్, దుర్గం చరణ్ తేజ్, బండారి రాజేష్, బత్తిని తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.