అవినీతి మేయర్ సునీల్ రావు ఖబర్దార్

కరీంనగర్, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ అసమర్ధ మేయర్ వై సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బిజెపికి అమ్ముడుపోయిందని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, పొన్నం ప్రభాకర్ గారిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారని చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా నేడు డిసిసి కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా వారు మాట్లాడుతూ, నగరంలోని భగత్ నగర్ లో కోట్ల రూపాయల ఆస్తులు, కోట్ల రూపాయలతో రాజభవనంలో నిర్మిస్తున్న ఇల్లు సునీల్ రావుకు చెందినదా లేక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినదా సమాధానం చెప్పాలి.

సామాన్య పేద కుటుంబం నుండి వచ్చిన సునీల్ రావుకు కేవలం ఒక స్కూటర్ మాత్రమే ఉండేది కానీ నేడు కోట్ల రూపాయల సంపదపరుడిగా ఎలా మారినాడో నగరంలో ఎవరిని అడిగినా చెబుతారు, కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని నాటి మంత్రి ఎం సత్యనారాయణ రావు గారిని చుట్టూ తిరిగి కష్టపడ్డ కార్యకర్తలను పక్కకు నెట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తెచ్చుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పదవిలో కొనసాగినావు.

కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నత పదవులు అనుభవించిన నువ్వు నీ కుటుంబంలో నీకు నీ భార్యకు నీ వదినకు కూడా కార్పొరేటర్ టికెట్లు తీసుకున్నావు నేడు మున్సిపల్ కార్పొరేషన్ లో రాజ్యమేలుతున్నావు. కరీంనగర్ గ్రూపు రాజకీయాలకు తెరలేపి, పొన్నం ప్రభాకర్ గారిపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన సునీల్ రావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి, పార్టీని పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసే వాళ్లు తప్ప నీలాంటి వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేసేవారు కాంగ్రెస్ పార్టీలో లేరని, నిత్యం ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ బిజెపి పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంది తప్ప నీలాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదు.

ఆర్ఎస్ఎస్ అడుగులకు మడుగులోత్తుతూ మూడు సంవత్సరాల పాటు నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం లేకుండా చేశావు, భారత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాత మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని నేటికి నెలకొల్ప లేదు.

కరీంనగర్లో మాతా శిశు సంక్షేమ కేంద్రం, కరీంనగర్ టు తిరుపతి రైలు, జగిత్యాల నుండి వరంగల్ వరకు జాతీయ రహదారి, కేంద్రీయ విద్యాలయాలు, బీసీ స్టడీ సర్కిల్ లాంటి ఎన్నో స్థాపించింది పొన్నం ప్రభాకర్ మాత్రమే అనే సంగతి మరిచిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గార్ల ఆశయాలు గనుగుణంగా పనిచేస్తూ లౌకిక వాద శాంతి స్థాపన కోసం పనిచేస్తారు.

మంత్రి గంగులతో విభేదాలతో నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో చీలికలు సృష్టించి బిజెపి పార్టీలోకి వెళ్లాలని చేస్తున్నావు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి వచ్చే వారిలో నువ్వే మొదటి వ్యక్తిగా ఉంటావు. ఇప్పటికైనా నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న శానిటేషన్, ముంపు కాలనీల అభివృద్ధి శివారు ప్రాంతాల అభివృద్ధి విషయంపై దృష్టి సారించాలని, అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేపట్టిన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మరొకసారి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని జిల్లా కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *