ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతుఏడ్చిన రాజ్యం అరిష్టం
ఎద్దు ఏడ్చిన ఎవుసం,
రైతుఏడ్చిన రాజ్యం అరిష్టం

- పంట రైతు కళ్ళముందే నీటి పాలైతుంది
- బార్ దాన్ ఇవ్వడంలేదు ఎప్పుడుకాంట పెడతారో తెలువదు
- తీగలగుంటపల్లి, నగునూర్ ఐకెపి సెంటర్ లో రైతుల సమస్యలు తెలుసుకున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) :గత పదిరోజులనుండి వడ్లుసెంటర్లకు వస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్రవీడడం లేదని వడ్లుకొనుగోలు చేయకపోవడం వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ళ పాలు అవుతున్నాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీగలగుంటపల్లి, నగునూర్ ఐకెపి సెంటర్ ను సందర్శించిన అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే నీళ్ళపాలవుతుంటే, పందులు తింటాఉంటే గుండెతరుక్కపోయి ఆవేదనతో భాధలు చెప్పుతాఉంటే ఈ ప్రభుత్వం రైతులను ఎంత గోసపెడుతుందో అర్థమవుతోందనీ ఇది మంచిది కాదని ఎద్దెడ్చిన ఎవుసం రైతుఏడ్చిన రాజ్యం అరిష్టం అని నరేందర్ రెడ్డి అన్నారు.

టార్పాలిన్లు అందించక వర్షాలకు తడుస్తున్నాయని వరదకు కొట్టుకుపోయి నీళ్ళపాలయితున్నాయని వెంటనే ఇప్పటికైనా యుద్దప్రాదిపదికన కొనుగోళ్లు ప్రారంభించాలని లేకపోతే రైతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు భూమయ్య, అశోక్ రెడ్డి, మల్లయ్య, సుగుణమ్మ, మధునయ్య నాయకులు గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, మెతుకు కాంతయ్య, శివరాం, కీర్తి కుమార్, మామిడి సత్యనారాయణ రెడ్డి, షేహెన్ష, ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
