నల్లెల్ల కుమారస్వామి మృతి మున్నూరు కాపులకు, ప్రజలకు తీరని లోటు
పేదప్రజలకు పెద్దదిక్కు నల్లేల్ల కుమారస్వామి
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ పురుషోత్తం రావు పటేల్
ములుగు, మార్చి 2 (విశ్వం న్యూస్) : నల్లెల్ల కుమార స్వామి మృతి మున్నూరు కాపులకు, జిల్లా ప్రజలకు తీరనిలోటని, పేద ప్రజల పెద్ద దిక్కులు కోల్పోయామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ పుటం పురుషోత్తం రావు పటేల్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నల్లెల్ల కుమారస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుమారస్వామి గత 40 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు వెన్నంటి ఉండి అనేక సేవా కార్యక్రమాలు అందించారన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం తాపత్రయపడే వారిని ఎవరు ఈ సమస్య కోసం వచ్చిన వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారని అన్నారు. ముఖ్యంగా మున్నూరు కాపుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ జిల్లాలో అందర్నీ ఏక తాటిపైకి తీసుకు వచ్చినందుకు అనేక రకాలుగా ప్రయత్నించి ఒక్క తాటిపై నడిపించిన మహానుభావుడు కుమార్ స్వామి అన్నారు. ఆయన మృతి జిల్లా ప్రజలకు మున్నూరు కాపు కుల బంధువులకు తీరనిలోటని అన్నారు. కుమార స్వామి ఆశయాలను జిల్లా ప్రజలు మున్నూరు కాపు సభ్యులు కొనసాగించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కో ఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ పటేల్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పెండల సంపత్ పటేల్ అద్యక్షులు, వరంగల్ పశ్చిమ అధ్యక్షులు కనుకూట్ల రవి పటేల్, వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ పోతూ కుమార స్వామీ పటేల్, పరకాల మాజీ మార్కెట్ చైర్మన్, పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ బొజ్జ రమేశ్ పటేల్, శేర్లింగంపల్లి కోఆర్డినేటర్ పర్వత సతీశ్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేశ్, సరయ్య తదితరులు పాల్గొన్నారు.