తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష
నేరవేర్చడమే జనసేన లక్ష్యం

  • జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం
  • 26 నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం

హైదరాబాద్, జూన్ 13 (విశ్వం న్యూస్) : జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారు. వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం. సాధించి నిష్ప్రయోజమన్నారు.
ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జులని నియమించారు.

వారందరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై… ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ భావాన్ని పట్టుకొని ముందుకెళితే ఏదైనా సాధించగలం. తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసిన ఆకాంక్ష.

ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం పాల్గొన్నారు.

  • 26 నియోజకవర్గాల బాధ్యుల వివరాలు
  • 1.శ్రీ వేమూరి శంకర్ గౌడ్: కూకట్ పల్లి
  • 2.శ్రీ పొన్నూరు లక్ష్మి సాయి శిరీష: ఎల్బీనగర్
  • 3.శ్రీ వంగ లక్ష్మణ గౌడ్: నాగర్ కర్నూలు
  • 4.శ్రీ తేజవత్ సంపత్ నాయక్: వైరా
  • శ్రీ మిరియాల రామకృష్ణ: ఖమ్మం
  • శ్రీ గోకుల రవీందర్ రెడ్డి: మునుగోడు
  • శ్రీ నందగిరి సతీష్ కుమార్: కుత్బుల్లాపూర్
  • డాక్టర్ మాధవరెడ్డి: లింగంపల్లి
  • శ్రీ ఎడమ రాజేష్: పటాన్ చెరువు
  • శ్రీమతి మండపాక కావ్య: సనత్ నగర్
  • శ్రీ వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు: శ్రీ శివ కార్తీక్ (కో కన్వీనర్): ఉప్పల్
  • శ్రీ వేముల కార్తీక్ : కొత్తగూడెం
  • శ్రీ డేగల రామచంద్రరావు: అశ్వరావుపేట
  • శ్రీ వి. నగేష్: పాలకుర్తి
  • శ్రీ మేరుగు శివకోటి యాదవ్: నర్సంపేట
  • శ్రీ గాదె పృద్వి: స్టేషన్ ఘనపూర్
  • శ్రీ తగరపు శ్రీనివాస్: హుస్నాబాద్
  • శ్రీ మూల హరీష్ గౌడ్: రామగుండం
  • శ్రీ టెక్కం జనార్ధన్: జగిత్యాల
  • శ్రీ చెరుకుపల్లి రామలింగయ్య: నకిరేకల్
  • శ్రీ ఎస్.నాగేశ్వరరావు: హుజూర్ నగర్
  • శ్రీ మాయ రమేష్: మంథని
  • శ్రీ మేకల సతీష్ రెడ్డి: కోదాడ
  • శ్రీ బండి నరేష్: సత్తుపల్లి
  • శ్రీ బైరి వంశీ కృష్ణ: వరంగల్ వెస్ట్
  • శ్రీ బాలు గౌడ్: వరంగల్ ఈస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *