పవిత్ర రాజ్యాంగ గ్రంథం
అందరూ చదవాలి

వీణవంక, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ఈరోజు టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో భాగంగా ఆ మహనీయునికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అనంతరం తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ భారతదేశానికే దిక్సూచిగా ఆదర్శంగా నిలపడం కోసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం నడివొడ్డున హైదరాబాదులో నిర్మించడం ఆనందకరమని జయంతులకు వర్ధంతి లకు జేజేలు కొట్టకుండా తను కోరుకున్న భారత దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి పేద ప్రజలు అభివృద్ధిలోకి రావడం కోసం రిజర్వేషన్ల ప్రక్రియను ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజ్యాధికారంలోకి రావాలని ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన ఓ గొప్ప నేత ఇప్పటికైనా యువతి యువకులు మేధావులు కర్షకులు కార్మికులు సబ్బండ వర్గాల ప్రజలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు కాట్రేవుల అజయ్, శ్రీకాంత్, కొలిశెట్టి కొండల్, రాపర్తి అరవింద్, సుమన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.