Today TrendingVishwam Newsకరీంనగర్తెలంగాణ

అంబేద్కర్ మనవడికి ఘన స్వాగతం

  • దళిత బంధు యూనిట్స్ లను పరిశీలించిన అంబేద్కర్ మనవడు

జమ్మికుంట, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ఈ రోజు రాజ్యాంగ నిర్మాత​ అంబేడ్కర్​ జయంతి సందర్భముగా హుజురాబాద్ కి విచ్చేసిన డా” బి.ఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జమ్మికుంట పట్టణంలో మూడు దళిత బంధు యూనిట్స్ పరిశీలించారు.

అనంతరం అక్కడి నుండి హుజురాబాద్ పట్టణం కు విచ్చేసి మూడు దళిత బంధు యూనిట్స్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మంత్రి వర్యులు గంగుల కమలాకర్, చెన్నూర్ ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, సుధా చెర్మైన్ జీవి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ కర్ణన్, సి.పి సుబ్బారాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *