- 356 అక్రమ కట్టడాలను గుర్తించి 16 కట్టడాలను కూల్చారు..
- కూల్చిన వాటిని కంప్లీట్ చేసి ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు
- ఇది అధికారుల లోపమా లేక ప్రజాప్రతినిధుల చెలగాటమా..
బోడుప్పల్, మే 21 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్పటి పాత కమిషనర్ 360కి పైగా అక్రమ కట్టడాలను గుర్తించి అందులో సుమారుగా 16 కట్టడాలను కూల్చివేశారు. పాత కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొత్త కమిషనర్ వచ్చారు. ప్రజా ప్రతినిధులు, వారి భర్తలు, టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం అప్పుడు కూల్చిన అక్రమ కట్టడాలను కంప్లీట్ చేయించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు వారి భర్తలు. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకు వేలాదిగా పుట్టుకొస్తు అక్రమ కట్టడాలు. పాత కమిషనర్ పోయిన తర్వాత మళ్లీ ఊపు అందుకున్న అక్రమ కట్టడాలు. పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
ఇన్చార్జి అధికారులతో అతలాకుతలం అవుతున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్. ప్రభుత్వానికి ప్రజలకు కార్పొరేషన్ కు రావలసిన కోట్లాధి రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు కార్పొరేషన్ కి రావాల్సిన కోట్లాది రూపాయలు రాక నష్టం వాటిల్లుతుంది. కార్పొరేషన్ పరిధిలో ఇల్లు, నల్ల, డ్రైనేజీ టాక్స్ కట్టకపోతే వాటిని తీసి వేసి సీజ్ చేస్తున్న వైనం మనకు కనబడుతుంది. కానీ అక్రమ కట్టడాలను ఎందుకు సీజ్ చేయడం లేదు, జరిమానా ఎందుకూ వెయ్యడం లేదు, కేసులు ఎందుకు బుక్ చేయడం లేదు.. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సి డి ఎం ఏ జిల్లా మంత్రి కమిషనర్ మేయర్ తదితరులు మేల్కొని వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గత సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ప్రజావాణి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్స్ సంవత్సరం పొడవునా ఇంతవరకు బోడుప్పల్ మున్సిపల్ అధికారులు కనీసం స్పందించలేదంటే అతిశక్తి కాదు. కాబట్టి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో జిల్లా కలెక్టర్, మంత్రి, సి డి ఎం ఏ, మేయర్ తదితర అధికారులు పర్సనల్గా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ కట్టడాల పైన అక్రమార్కుల పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసిన బాధితులు కోరుతున్నారు.