కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి..

కవల పిల్లలను చంపి..
ఆత్మహత్య చేసుకున్న తల్లి..

  • చనిపోతూ ఏమి చెప్పిందంటే..!!

రాజస్థాన్‌, జనవరి 3 (విశ్వం న్యూస్) : రాజస్థాన్‌లో ఓ మహిళ మమతను మరచింది.. తన రెండున్నరేళ్ల కవల కొడుకులను చేతులారా విషం ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత తానూ విషం తీసుకుంది. చికిత్స పొందుతూ ఆ తల్లి కూడా మృతి చెందింది. ఈ విషాద ఘటన సిరోహి జిల్లాలోని శివగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న తల్లికి తన కవల కొడుకులు అంటే ఇష్టం లేదు. వారిని చూసుకోవడంలో తాను అలసిపోతున్నట్లు భావించింది. అందుకే పాలలో విషం కలిపి ఇద్దరికీ తాగించింది. ఆ తర్వాత తానూ కూడా ఆ విషం సేవించింది. ఈ ఘటనలో ముందు పిల్లలు మృతి చెందగా.. ఆ తర్వాత ఆ కసాయి తల్లి కూడా మరణించింది.

మృతురాలి పేరు రేఖ..భర్త పేరు యోగేష్ చింపా… రేఖ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీస్ లు. పాలి జిల్లాలోని సేవడిలో నివసిస్తుంది. రేఖకు పూర్వంష్ , పూర్విత్ అనే ఇద్దరు సంవత్సరాల కవలకుమారులు ఉన్నారు. భర్త మహారాష్ట్రలో టైలరింగ్‌ పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం రేఖ తన కుమారులిద్దరికీ విషం ఇవ్వడమే కాదు తను కూడా విషం తాగింది. దీంతో ముగ్గురూ చనిపోయారు.

రేఖ ఏమి చెప్పిందంటే..!!
మృత్యువుతో పోరాడుతున్న రేఖ ఆస్పత్రిలో చేరడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రేఖ వాంగ్మూలం తీసుకున్నారు. తన కవలపిల్లలను పెంచడానికి ఇబ్బంది పడుతున్నానని.. అందుకనే వారిని చంపి.. తాను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తాను వేసుకున్న ప్లాన్ ను అమలు చేయడానికి.. విషం రెడీ చేసుకుని.. తన ప్లాన్ ప్రకారం తల్లిని బుధవారం మధ్యాహ్నం తల్లిని బయటకు పంపింది. తర్వాత పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై తాను తీసుకుంది. కొడుకుల మరణవార్త విన్న తండ్రి యోగేష్ గుండె పగిలేలా ఏడుస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *