నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను
తక్షణమే సస్పెండ్ చేయాలి

జమ్మికుంట, మార్చి 27 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ఈరోజు తెల్లవారుజామున అమీనా (8 తరగతి) అనే విద్యార్థి ని రంజాన్ నెల సందర్భంలో చెరువుపైకి పోయి నమాజు చేయడానికి వెళ్లి జారిపడి ఎడమచేతు భుజం విరిగింది. ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్ కు విద్యార్థి చెప్పినా కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూర్చోబెట్టి తల్లిదండ్రులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు హుటాహుటిన మైనార్టీ బాలికల హాస్టల్ కు విచ్చేసి తమ పాపను చూసేసరికి ఎడమచేతి భుజం వద్ద వాపు గమనించి తల్లిదండ్రులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎడమ భుజం విరిగినట్టుగా డాక్టర్ నిర్ధారించారు.

ఈ సమస్యను తల్లిదండ్రులు యూత్ కాంగ్రెస్ నాయకులకు సమాచారం అందించగా వారు తక్షణమే పాఠశాల ఆవరణలోకి వెళ్లి సంబంధిత ప్రిన్సిపాల్ తో మాట్లాడదామనేసరికి ప్రిన్సిపాల్ లేకపోవడం ఇన్చార్జిగా ఎవరున్నారో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం విద్యార్థి తల్లిదండ్రులకు ఎంత బాధ పడుతున్న కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల అధికారి అంబేద్కర్ గారికి ఫోన్ ద్వారా యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సజ్జాద్, మహమ్మద్ దౌలత్ లు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తక్షణమే వీరిపై చర్యలు తీసుకోకపోతే పాఠశాల ముందు ధర్నా రాస్తారో చేసి విద్యార్థికి తగు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *