
కరీంనగర్, ఫిబ్రవరి 28 (విశ్వం న్యూస్) : కరీంనగర్ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం పరిచయం వేదిక కరీంనగర్ పట్టణంలో ప్రకృతి రెస్టారెంట్ పద్మానగర్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టీటీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ వెల్లడి, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కరీంనగర్ డివిజన్ టిసిటిఎన్జీవోస్ సంఘమ అధ్యక్షులు జి బిక్షపతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భముగా మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన మూడు డిఏలు, పాత పెన్షన్ విధానం, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖలో పెండింగ్ ఉన్న సలండర్ లీవ్ బకాయిలు, జిపిఎఫ్ బకాయిలు, పదవి విరమణ పొందిన ఉద్యోగి గ్రాడ్యుయేట్, బకాయిలు, మెడికల్ బిల్లు బకాయిలు, ఎన్నో రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులు ప్రభుత్వం వద్దనే పెండింగ్ లోనే ఉన్నాయి.

ఆ బిల్లులన్నీ మంజూరు చేయడానికి తెలంగాణ టీఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ కృషి చేయాలని, అలాగే వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలని, ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కు సంబంధించిన జీవో ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ మంజూరు కాలేదని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
2017 నుండి 2024 వరకు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు, సీనియర్ అసిస్టెంట్లకు మరియు ఏసీటీవోలకు ఇప్పటివరకు సీనియార్టీ లిస్టు లేక ప్రమోషన్లు రాక ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారని గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ 317 జీవో ద్వారా ఏ జిల్లాలో పనిచేస్తున్న ఈ ఉద్యోగునికి ఏ జిల్లాలో కూడా ఉంచకుండా, ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలు వీధిన పడ్డాయి. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి 317 జీవోపై ఒక సబ్ కమిటీ మంత్రులను వేయటం చాలా సంతోషమని 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తిరిగి వారి వారి ప్రాంతాలకు బదిలీ అయినట్లు చర్యలు తీసుకోవాళ్లన్నారు.

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫోర్త్ క్లాస్ నాన్ గెజిటెడ్ మరియు గజిటెడ్ ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని వాణిజ్య పనుల శాఖలు ఉన్న అన్ని సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరించుకోవడానికి మన వంతు కృషి చేస్తామని మరియు ఇదే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా వచ్చినట్లు మా సంఘం కూడా కృషి చేస్తుందని ఈ శాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులందరూ ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావడానికి ప్రతి ఒక్కరూ రాత్రి పగలు కృషి చేయాలని ప్రభుత్వం అనుకున్న కంటే ఎక్కువ రెవిన్యూ ప్రభుత్వ ఖజానాకు చేయడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సైనికుల్లాగా పని చేయాలని నూతనముగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు జరిగిన ఎన్నికలలో నూతన కార్యవర్గం ఎన్నిక కావడం చాలా సంతోషమని ఉద్యోగ సంఘాలు మొదటిగా మన శాఖకు న్యాయం చేయాలి మరియు ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను కూడా పట్టించుకోకపోవడం వలన తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని కొత్త జోనల్ ఏర్పాటు చేసేటప్పుడు తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘమిచ్చిన సలహాలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు వారికి తోచినట్టు వారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులు ఇబ్బందుల పాలు కావడానికి కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

317 జీవో ద్వారా ఇబ్బందుల పాలైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి ఇటీవల ఒక కమిటీ క్యాబినెట్ మంత్రుల ద్వారా నియమించింది దీనిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నరసింహ కమిటీ సభ్యులుగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కు సంబంధించిన మంత్రులు రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రివర్యులు డి శ్రీధర్ బాబు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అన్ని రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకొని వెళ్లి ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని జగదీశ్వర్ ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. నూతనముగా ఎన్నికైన కరీంనగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘ నాయకులు జి బిక్షపతి, ప్రవీణ్ రెడ్డి, మహమ్మద్ సలావుద్దీన్, ఏ అనిల్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ బారి, శ్రీమతి రజిత, శ్రీమతి కృష్ణవేణి, హరి, వెంకటరమణ, రాజేశ్వరరావు, లంబు శ్రీనివాస్, జి సునీత, విష్ణువర్ధన్, నరేష్, హరి సింగ్, శంకర్, శ్రీనివాస్ వీరందరిని శాలువలతో మరియు పుష్పగుచ్చాలతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్, మేనేజర్ మాదయ్య, సిటిఓలు శ్రీమతి సుమలత, హరిచరణ్, ఎన్వి రమేష్, మహమ్మద్ ఉధూరత్, జి ప్రభాకర్, గోపికృష్ణ, రమేష్, హరికృష్ణ, సాయి కృష్ణ, మహమ్మద్ ఫహీమ్, మహమ్మద్ అఖిల్, మహమ్మద్ ముజీబ్ హుస్సేన్, శ్రీనివాస్, కరీంనగర్ టీఎన్జీవో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.