కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2 వేలకి
పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2 వేలకి పైగా ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2,049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? ఎవరు అర్హులు.?. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం 2,049 పోస్టులకు గాను ఆయా పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సాధించి ఉండాలి.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఫిబ్రవరి 26వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక దరఖాస్తుల ఫీజు చెల్లింపునకు మార్చి 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఒకవేళ అప్లికేషన్స్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటే మార్చి 22వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు..