ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుది బండలు

  • అమలు చేయాలంటే అప్పులు చేయాలి, భూములు అమ్మాలి, పన్నులు పెంచాలి

హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : 1) రైతు బంధు( బరోసా) 15000 ఇవ్వాలంటే జి ఓ తేవాల్సివుంది , ఒకే వ్యవసాయ భూమికి రైతుకు కౌలు రైతుకు ఇద్దరికీ ఇస్తారా? లేదా ఒకరికి మాత్రమే ఇచ్చి ఇంకొకరికి ఎగనామమం పెడతారా? చూడాలి, ఏటా వ్యవసాయ కూలీలకు రూ 12000 ఆర్థిక సహాయం చేయడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? చెప్పాలి, వరి పంట కు కింటకు రూ 500 బోనస్ అన్నారు. 2 లక్షల రైతు రుణ మాఫీ ఎప్పుడు జరుగుతుందో కాల పరిమితి పెట్టలేదు జి ఓ తేలేదు.

2) CM రిలీఫ్ ఫండ్ సుమారు 90 వేల దఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, ఎప్పుడు వారికి విడుదల చేస్తారన్నది స్పష్టత లేదు.

3) ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలను 10 లక్షలు చేసినా ఇంతవరకు ట్రీట్ మెంట్ చేపించుకున్న వారు లేరు ఎందుకు ప్రవేట్ దవాఖాన లు పాత బకాయిలు చెల్లించనీ కారణంగా కొత్తగా ఆరోగ్య శ్రీ పథకం కింద ట్రీట్ మెంట్ చేయడం లేదు.

4) తెల్లరేషన్ కార్డు వుండి అర్హత లేని వారు లక్షలలో ఉన్నారు కానీ వారి కార్డులు రద్దు చేయరు, అర్హులు అయిన వారు చాలా మంది ఉన్నారు వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు, రైతు బంధు రాళ్ళకు గుట్టలకు రోడ్లకు గత ప్రభుత్వం ఇవ్వడం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయి,అని మొత్తుకున్నాము, మరి సంపన్నులకు తెల్ల రేషన్ కార్డు ద్వారా పథకాలు ఇవ్వడం వలన కూడా వేల కోట్ల రూపాయలు వృధా అవుతాయి,రద్దు చేసే సహసం చేస్తారా? ఓట్ల రాజకీయం కదా చేయరు.

5) గృహాలక్ష్మి: ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 500 వందల కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం అంటున్నారు బాగుంది, మిగితా స్త్రీలు గృహ లక్ష్మి లు కారా? కానీ ఏ ప్రతి పాధికన అర్హుల ను ఎన్నిక చేసారు 40 లక్షల మంది నీ గుర్తించాం అని ముఖ్య మంత్రి గారు చెప్పుచున్నారు, ఇన్ని కుటుంబాలు పేదరికం లో ఉన్నాయా? వీరందరికీ ఇండ్లు,ఓపెన్ ప్లాట్లు కార్లు,లేవా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదా? ఇవ్వన్ని ఉన్నా తెల్ల రేషన్ కార్డు వుంటే ఇస్తారా? ఇస్తే సమంజసమేనా?

సిలిండర్ తీసుకునే టప్పుడే 500 రూపాయలకు ఇస్తే బాగుండేది, బ్యాంక్ లో సబ్సిడీ అమౌంట్ వేయడం ఎందుకు? PM ఉజ్వల యోజన కింద LPG కనెక్షన్ లు అందరికీ ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది.

6) గృహ జ్యోతి పథకం: ఈ పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు వుండాలి, తెలంగాణ వారై ఉండాలి, మరి కిరాయి (అద్దె) ఇండ్లలో ఉండే స్త్రీ లు జ్యోతీ లు కారా? వారి పరిస్తితి ఎట్లా? వారు కరెంట్ బిల్లు చెల్లించాలా? ఈ ప్రశ్న లకు సమాధానం చెప్పాలి అద్దె కు వుండే వారికి కూడా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ గా ఇవ్వాలి. ఇది కూడా ప్రతి పక్ష పార్టీలకు అస్త్రాలు అవుతాయి.

7) సంపన్న స్త్రీ లకూ ఉచిత బస్ సౌకర్యం కల్పించడం కూడా వృధా ఖర్చే , సంపన్న స్త్రీలకు కట్ చేసి పేద పురుషులకు ఇవ్వండి ఉచిత బస్ సౌకర్యం.

8) మహాలక్ష్మీ: ఈ పథకం కింద ప్రతి మహిళ కు రూ 2500 ఆర్థిక సహాయం అన్నారు,ప్రతి మహిళకు ఇస్తారా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇస్తారా?.

9) ఇందిరమ్మ ఇళ్లు: ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు ఆర్థిక సహాయం, ముందుగా స్థలం కేటాయించండి లేని వారికి తరువాత రూ 5 లక్షలు ఆర్థిక సహాయం చెద్దురు, తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల స్థలం జూబ్లీ హిల్స్ లేదా నానక్ రామ్ గూడ, కోకా పేట లో ఇవ్వండి అర్జెంట్ గా 1200 మందికి.

10) యువ వికాసం: విద్యా బరోసా కార్డ్ కింద విద్యార్థులకు రూ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అందరికీ ఇస్తారా? కొందరికేనా ? నిబంధనలు విడుదల చేయాలి.

11) చేయూత: పించన్ దారులకు రూ 4000 ఎప్పుడు ఇస్తారో కాల పరిమితి పెట్టలేదు.

12) వికలాంగులకు రూ 6 వేలు ఇస్తాం అన్నారు వారు ఎదురు చూస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జవాబు లేని ప్రశ్నలు. ఓట్లు రాల్చే చెత్త పథకాలు, వీటితో అభివృద్ధి జరగదు. విద్య వైద్యం అందరికీ రూపాయి ఖర్చు కాకుండా ఇచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుంది, ప్రవేట్ వైద్య వైద్యాన్ని జాతీయం చేయాలి. అన్నీ పార్టీలు హామీలు ఇచ్చి నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నీ నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఈ పథకాలు అమలు చేయడం అంటే పెద్ద సవాల్ , ఈ పథకాలు అన్ని అమలు చేస్తే మాత్రం ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, లేదంటే ఇవ్వే పథకాలు ప్రతి పక్ష పార్టీలకు అస్త్రాలు అవుతాయి.

తెల్ల రేషన్ కార్డు వుండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు ఉన్నారు ఇండ్లు పొలాలు, ఓపెన్ ప్లాట్లు కార్లు ఉన్న వారు లక్షలలో ఉన్నారు, వీరికి దోచి పెట్టడమే, నిజమైన అర్హులకు మాత్రమే ఇస్తే బాగుంటుంది.

నారగోని ప్రవీణ్ కుమార్
(సామాజిక కార్యకర్త)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *