జగతికి మూలం.. గురువులు
ప్రగతికి మూలం.. గురువులు
- పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
- ట్రెండ్ గా మారిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు
- ఏళ్లు గడుస్తున్న గురుభక్తిని చాటుకుంటున్న పూర్వ విద్యార్థులు
- నేడు టీచర్స్ డే
కాజీపేట (విశ్వం న్యూస్) : జగతికి మూలం గురువులు ప్రగతికి మూలం గురువులు.. అన్నట్లు దేశాభివృద్ధిలో గురువులు చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. నేటి బాలలే.. రేపటి పౌరులు.. ఆ పౌరులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా నాటి నుంచి. నేటి వరకు.. గురువులు నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్య చాలా ఖరీదు కావడంతో.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని విధాలుగా అండగా నిలుస్తు.. వారిలో అంతర్లీనంగా ఉన్న శక్తులను వెలికి తీస్తున్నారు.
గురువు స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటాం. ఈ గురుపూజోత్సవం సందర్భంగా.. భాషోపాధ్యాయుడిగా.. కొరియోగ్రాఫర్ గా.. హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన బండ రవీందర్ హిందీ భాష ఉపాధ్యాయుడుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ లో ప్రస్తుతం పని చేస్తున్నారు.
30 ఏళ్ళుగా ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నాడు. ఏ పాఠశాలలో పనిచేసిన విద్యార్థులను తన కన్న బిడ్డలుగా చూడడంతో పాటు పాటలు, నృత్యాలలో కొరియోగ్రాఫర్ గా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అలాగే టెన్త్ లో 100% ఉత్తీర్ణతను సాధింప చేయడంతో పాటు.. టెన్ బై టెన్ సాధించిన తర్ఫీదునిస్తాడు. 1993 నుంచి మొదలుకొని నేటి వరకు తన చదువుకున్న పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి రవీందర్ సార్ ను ఘనంగా సన్మానిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా… టీచర్స్ డే ను పురస్కరించుకుని చాలామంది విద్యార్థులు కొండపర్తికి చేరుకొని రవీందర్ సార్ పూలమాలతో సత్కరిస్తూ గురుభక్తిని చాటుకుంటున్నారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. శిక్షణ పొందిన విద్యార్థులు పలు రంగాల్లో స్థిరపడడమే తనకు ఇచ్చిన గురుదక్షిణగా పేర్కొన్నారు.