TSPSC పేపర్ లీకుపై రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి

TSPSC పేపర్ లీకుపై రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి

  • వైద్యుల అంజన్ కుమార్ (రాష్ట్ర కార్యదర్శి టిపిసిసి-కరీంనగర్)

కరీంనగర్, మార్చి 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటినుండి ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించకుండా 30 లక్షల నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం గతంలో నిర్వహించిన అనేక పరీక్షలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారు.

  • 2016లో జరిగిన సింగరేణి ఉద్యోగ నిమకాల్లో ఆనాటి కవితపై ఆరోపణ రావడం
  • గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగి తప్పుల వల్ల 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు
  • ఎంసెట్ పరీక్ష పేపర్ లీక్ చేసిన దోషం కూడా ఇప్పటివరకు శిక్షించలేదు

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధులు నియామకాలు ఉద్యోగుల కొరకు కానీ నేటి పరిస్థితులు కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగా నోటిఫికేషన్లు సరిగా నిర్వహించగా పరీక్ష పేపర్లు లీక్ చేస్తూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నది ఇట్టి మోసాన్ని భరించలేని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై వెంటనే సిబిఐ ఎంక్వయిరీ చేసి దోషులను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ డిమాండ్ చేస్తున్నాం.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై…

  • టీఎస్పీఎస్సీ చైర్మన్ ను భాద్యత వహిస్తూ బర్తరఫ్ చేయాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేయాలి

లీకేజీతో తనకేం సంబంధం అంటున్న కేటీఆర్ కు కొన్ని ప్రశ్నలు…

  • సంబంధం లేక పోతే సమీక్షలో ఎట్లా కూర్చున్నావ్?
  • సంబంధం లేకపోతే ఇద్దరే
    దోషులని ఎట్లా చెబుతున్నావ్?
  • నువ్వేమైనా విచారణాధికారివా?
  • పోలీసు కస్టడీ కాకముందే ఇద్దరే
    దోషులని నీకేవరు చెప్పారు?
  • సంబంధం లేకపోతే మీడియాతో
    నువ్వెట్ల మాట్లాడావ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *