అంధకారంలోనే యూపీ
- విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 60 గంటలుగా కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక సమ్మె.
ఉత్తరప్రదేశ్, మార్చి 19 (విశ్వం న్యూస్) : విద్యుత్ లేక అవస్థలు పడుతున్న ఉత్తరప్రదేశ్ లోని అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాల ప్రజలు. రాత్రిళ్లు కరెంట్ లేక నరకం అనుభవిస్తున్నాం అని యూపీ సీఎం పై మండిపడుతున్న యూపీ ప్రజలు. పరీక్షల సమయంలో రోజుల కొద్దీ ఇలా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ విద్యార్ధులు, తల్లిదండ్రులు. దాదాపు అన్ని పవర్ జనరేషన్ స్టేషన్ లను షట్ డౌన్ చేసిన ఇంజనీర్స్ దీనితో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి. ప్రైవేట్ ఆపరేటర్ లతో బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు యత్నం అడ్డుకున్న విద్యుత్ ఇంజనీర్స్, ఉత్తరప్రదేశ్ లో సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు మద్దతు తెలిపిన నేషనల్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శైలేంద్ర ధోబే, కన్వీనర్ రత్నాకర్ రావు. ప్రైవేటీకరణ ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తాం అంటున్న విద్యుత్ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ లేదంటే మా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని యూపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.