
హైదరాబాద్, డిసెంబర్ 15 (విశ్వం న్యూస్) : పుష్ప 2.. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో రిలీజ్ తర్వాత కూడా అంతే హైప్ క్రియేట్ చేసింది. అయితే పుష్ప 2లో పుష్ప రాజును అరెస్టు చేసేందుకు ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే ఇదంతా రీల్ స్టోరీ.. కానీ రియల్ స్టోరీలో మాత్రం పుష్పాను అరెస్టు చేస్తాడు ఓ సిఐ.. అతని పేరే బానోతు రాజు నాయక్

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్‌కు పెద్ద సంఖ్యలో సినిమా చూసేందుకు అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమాని అయిన శ్రీ తేజ్ కుటుంబ సభ్యులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడ జరిగిన తొక్కిసలాటలో భాగంగా శ్రీ తేజ్ తల్లి రేవతి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్‌లో శ్రీ తేజ్ చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌తో సహా వ్యక్తిగత బౌన్సర్లు, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. అయితే పుష్ప 2 సినిమాలో ఎస్పీ షెకావత్‌కు దొరకకుండా తప్పించుకునే పుష్ప రాజ్ రియల్ లైఫ్‌లో మాత్రం పోలీసులకు చిక్కాడు. పుష్పాను అరెస్టు చేశాడు చిక్కడపల్లి సీఐ బానోత్ రాజు నాయక్ అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌కు ఈ సిఐ కూడా ఓ అభిమాని. ఒక్కసారైనా అల్లు అర్జున్‌తో ఫోటో దిగాలనుకున్న సిఐ తన అభిమాన హీరోని అరెస్టు చేసే ఒక రోజు వస్తుందని ఊహించలేదని అంటున్నారు.