వీఆర్ఏల పే స్కేల్ ఇదే.. జీవో జారీచేసిన సర్కార్

హైదరాబాద్, జూలై 24 (విశ్వం న్యూస్) : వీఆర్ఏలను తెలంగాణ ప్రభుత్వం క్రమబద్దీకరించింది. సోమవారం సాయంత్రం జీవో విడుదల చేసింది. దీంతో వీఆర్ఏల కోరిక నేరవేరింది. తమను రెగ్యులరైజ్ చేయాలని ఇదివరకు 100 రోజులకు పైగా వీఆర్ఏలు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. క్రమబద్దీకరిస్తామని మాట ఇచ్చింది. ఆ వెంటనే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల పోస్టులు, రెగ్యులరైజేషన్‌కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసింది. కమిటీ సూచనల మేరకు.. చదువును బట్టి వేతనం, పోస్ట్‌ ఖరారు చేసింది.

తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏ లకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *