కంట్లో కారం చల్లి పుస్తెలతాడు చోరీ
- 24 గంటల్లో పట్టుకున్న మేడిపల్లి పోలీసులు..
- మేడిపల్లి పోలీసులను ప్రశ్నించిన డిసిపి జానకి
- ఏసిపి నరేష్ రెడ్డి, సిఐ గోవర్ధన గిరి హాజరు
పీర్జాదిగూడ, మే 9 (విశ్వం న్యూస్) : యవ్వన యువతి, యువకుడు లవర్స్ కలిసి జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో చాయ్ డబ్బా నిర్వహిస్తున్న మహిళ కంటిలో కారం కొట్టి మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసు దొంగలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మల్కాజగిరి డీసిపీ తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 5వ తేదీ మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సిపిఆర్ఐ రోడ్డు జన సంచారం లేని ప్రాంతంలో టీ షాప్ నిర్వహిస్తున్న ఒక మహిళ వద్దకు యాక్టివాపై ఆయా కిలాడీ లవర్స్ వచ్చి టీ తాగి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత సదరు యువకుడు మరల వచ్చి సిగరెట్ అడగగా సిగరెట్ ఇచ్చే సమయంలో మహిళా కంట్లో కారం కొట్టి,ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు చైన్ లాక్కుని వెళ్లిపోయారు. సంఘటన జరిగిన గంట తర్వాత బాధిత మహిళా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాగ, వెంటనే స్పందించిన పోలీసులు డీసీపీ, ఏసిపి, సీఐ, డిఐ లు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం నిందితులను గుర్తించి 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి మాట్లాడుతూ.. నిందితులు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గొల్ల నరేష్(25), శ్రీరామ బాయ్స్ హాస్టల్ ఉప్పల్ లో ఉంటూ మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేస్తున్నాడు. రామంతపూర్ కు చెందిన వై. శిరీష(25), ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది,నిందితులు ఇద్దరు కలిసి జల్సా లకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే, ఈ నేరానికి పాల్పడ్డారనీ, ఈ నేరానికి పాల్పడిన యాక్టీవా నెంబర్ ప్లేట్ ను తెలియకూడాదనే నెంబర్ ప్లేట్ ను ఫోల్డ్ చేయడం జరిగింది.
నెంబర్ ప్లేట్ లేకుండా గాని, నెంబరు ప్లేట్ కనబడకుండా గాని వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోబోనున్నామని, తనిఖీలు ముమ్మరం చేసి ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని,అలానే ప్రజలు ఊరికి వెళ్లే ముందు బయట డోర్లకు తాళాలు లోపల నుండి వేసుకోవాలని, ఇంట్లో ఎవరూ లేరని అందరికీ తెలిసేటట్లు చేయవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ జానకి తెలిపారు. ఈమేరకు చాకచక్యంగా 24 గంటల్లోపు పట్టుకున్న సిబ్బందిని ప్రశంసించారు. జల్సాలు అలవాటు పడి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహారిస్తామని యువతి యువకులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపి నరేష్ రెడ్డి, సిఐ గోవర్ధనగిరి, డిఐ ప్రవీణ్ బాబు సిబ్బంది తదితరులు హాజయ్యారు.