టిఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా
అధ్యక్ష, కార్యదర్శిలు ఏకగ్రీవ ఎన్నిక

కరీంనగర్ బ్యూరో, మే 23 (విశ్వం న్యూస్) : సోమవారం రోజున కరీంనగర్ లో జరిగిన టీఎన్జీవోల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి మారం జగదీశ్వర్ ల సమక్షంలో టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా దారం శ్రీనివాస్ రెడ్డి ని కార్యదర్శిగా సంగెం లక్ష్మణరావు ని జిల్లా కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం రోజు వారి కార్యవర్గంతో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ని జిల్లా పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ని డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ నాగరాజు ని అలాగే రోడ్లు, భవనాల శాఖ సూపరిటేండింగ్ ఇంజనీర్ చందర్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉద్యోగ సంఘ నాయకులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపి వారు రాబోయే రోజుల్లో ఉద్యోగుల సంరక్షణకై ఎల్లవేళలా ఉద్యోగులకు అందుబాటులో ఉండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కోశాధికారి కిరణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, మహిళా జేఏసీ చైర్మన్ శారద, మహిళా నాయకులు సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి , అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మేందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ , భరద్వాజ్ , తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, జిల్లా నాయకులు ఒంటేల రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, గూడ ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధీర్ కుమార్, బైరి శ్రీనివాస్ వెలిచాల శ్రీనివాసరావు, మల్కా రాజేశ్వరరావు, అనిల్ కుమార్, మమ్నీత్ సింగ్, ప్రణీత్ , అక్బరుద్దీన్, కొండయ్య, జలాలుద్దీన్ అక్బర్, రాజమల్లయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.