నేడు వైకుంఠ-ముక్కోటి ఏకాదశి పర్వదినం…

నేడు వైకుంఠ-ముక్కోటి ఏకాదశి పర్వదినం…

సుందరంగా ముస్తాబైన దేవాలయాలు

తిమ్మాపూర్, జనవరి 1 (విశ్వం న్యూస్) : వైకుంఠ ఏకాదశి పర్వదినం నూతన సంవత్సరం ప్రారంభంలో సోమవారం రోజున రావడంతో ప్రత్యేక త, ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషే కాలు, ప్రత్యేక దర్శనానికి వైష్ణవాలయాలలో ప్రత్యేక భారీ ఏర్పాట్లు చేశారు. -ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత.. పై వేద బ్రాహ్మ ణులు, శ్రీ వైష్ణవ పూజారులు వైకుంఠ ఏకాదశి పురాణం కథనంపై మాట్లాడుతూ…అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయ ణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవ డం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించ డం వల్ల ముక్కోటి ఏకాదశిగా ఈ పర్వదినం ప్రాశ స్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటు న్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృతయుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్ర మాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేం దుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు. అదే అదన నుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపం లో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదిం చాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మ వారిని అర్చిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ వైష్ణ వులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరి స్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరు మల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరా యణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకే తం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ము లందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమే తుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగర ణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజిం చి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకా దశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదు అనేది హైందవ పురాణాల ప్రకారం భక్తుల విశ్వాస ము నమ్మకం. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆయా గ్రామాలలోని హిందూ దేవాలయాలలో ఆల య కమిటీ పాలకవర్గం, సభ్యులు ప్రత్యేక దర్శనానికి భారీ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *