త్రిబుల్ ఐటీ బాసర : 9 వేల మంది విద్యార్థులకు 9 మంది రెగ్యులర్ స్టాప్.. సరిపోతారా సార్..?

  • గ్రూపుగా వాకింగ్ చేస్తున్నారని సెక్యూరిటీ బెదిరింపులు..
  • సెక్యూరిటీ కి మద్దతుగా ఈ2, ఈ3 విద్యార్థుల సస్పెన్షన్..
  • విద్యార్థుల వారం రోజుల నిరాహారదీక్షకు ఫలితమే లేకపాయే..
  • విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యూనివర్సిటీకీ ఆంక్షలు
    పెరిగాయి తప్ప అభివృద్ధి శూన్యం
  • సంవత్సరం కావస్తున్న వెండర్లు, టెండర్లు, మెస్ లు మారలేదు, మారరు కూడా..?
  • త్రిబుల్ ఐటీ బాసరలో ఆంక్షలు తప్ప.. అభివృద్ధి శూన్యం…

బాసర, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : ఆర్జెయుకేటి బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో సాయంత్రం గ్రూప్ గా వాకింగ్ చేస్తుండగా ప్రశ్నించిన సెక్యూరిటీ వర్సెస్ ఈ2, ఈ3 విద్యార్థుల మధ్య చిలరేగిన చిన్న సమస్య విద్యార్థుల సస్పెన్షన్ కు దారితీసింది. త్రిబుల్ ఐటీ బాసర తల్లిదండ్రులకు, పేరెంట్స్ కమిటీకి, విద్యార్థులకు యూనివర్సిటీకి ఆంక్షలు పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం అని అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు వాపోతున్నారు. పియుసి 1,2 ఇంజనీరింగ్ ఈ1 టు ఈ4 విద్యార్థులు ఎండనక వాననకా వారం రోజులపాటు శాంతియుత నిరసనలతో పాటు ధర్నా చేసి ఆశించిన మౌలిక సదుపాయాలు గాని విద్యా, వైద్యం, వెండర్లు, టెండర్లు, మెస్ లు, చక్కటి భోజనం, రెగ్యులర్ స్టాప్, క్వాలిఫై టీచర్స్ లాప్టాప్స్ ఏది కూడా ఇప్పటివరకు వారికి దక్కలేదంటే అతిశయోక్తి కాదు. కానీ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు, బిల్డింగ్స్, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ విద్యార్థిని విద్యార్థుల మీద మాత్రం ఘోరమైన కఠినమైన ఆంక్షలు మాత్రం పెరిగాయి.

కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి విద్య వైద్యం చదువు స్టాప్ తదితర మౌలిక సదుపాయాల తీరు మాత్రం మారలేదని తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అంటున్నారు. కాబట్టి మరోసారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షతన మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇక్కడ చూసిన ఇప్పుడు చూసినా పియుసి1,2 ఇంజనీరింగ్ ఈ1 టు ఈ4 విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఏ ఒక్కరి మొఖం మీద ఇంత ఖండలేదు. బిడ్డలందరూ ఆకలితో అలమటిస్తున్నట్టు, సరిపడా ప్రోటీన్ విటమిన్స్ తో కూడిన భోజనం లేనట్టు పెడతలేనట్లు కనబడుతున్నారు వారిని చూసి తల్లిదండ్రులు దుఃఖ సంద్రంలో మునిగిపోతున్నారు. ఇంటర్నెట్ కోసం సరిపడక ఇంటర్నెట్ పోల్స్ దగ్గరికి పరుగులేడుతున్నారు విద్యార్థులు.

పేరెంట్స్ కమిటీ ఏర్పడి ఒక సంవత్సరం కావస్తుంది. పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, యూనివర్సిటీ డైరెక్టర్ విసితో ఏం మాట్లాడుతున్నారు.ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనే విదీవిధానాలు మాత్రం ఎవ్వరికీ తెలియ రావడం లేదు.మొన్న పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఒక నెల రోజుల్లో వెండర్స్, టెండర్స్ కంప్లీట్ అయి పిల్లలకు మంచి నాణ్యమైన భోజనాలు అందించే టెండర్లు, వెండర్లు తీసుకొస్తామని, చక్కటి భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు.. మూడు నుంచి నాలుగు నెలలు కావస్తున్న దాని ఊసే లేదు.. యూనివర్సిటీలో విద్యార్థుల పైన తల్లిదండ్రుల పైన ఆంక్షలు తప్ప అభివృద్ధి లేదనేది సుస్పష్టంగా కనబడుతుంది.

9 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు 9 మంది రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉన్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి త్రిబుల్ ఐటీ భాసర యూనివర్సిటీలో నెలకొందో ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మేధావులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు,స్టాప్ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు, అభివృద్ధి, చదువు, చక్కటి భోజనం, ఆరోగ్యం చూసుకోవడానికి తప్ప.. విద్యార్థుల మీద ఆంక్షలు పెడుతూ తల్లిదండ్రులను లోపటికి రానివ్వకుండా విద్యార్థులను ఆరోగ్య పరంగా, చదువు పరంగా చంపే ప్రక్రియ కొనసాగుతుంది. ఏదో ఒక సెక్యూరిటీతో దూషణ పదజాలంతో మాట్లాడితే విద్యార్థులను సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితిలో నెలకొంది అంటే విద్యార్థులు ఎంత భయాందోళనకు గురవుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *