వెలుగు(V6)పై కేటీఆర్ వ్యాఖ్యలకు టీడబ్ల్యూజేఎఫ్ ఖండన

వెలుగు(V6)పై కేటీఆర్ వ్యాఖ్యలకు టీడబ్ల్యూజేఎఫ్ ఖండన

హైద‌రాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు వి6 ఛానెల్, వెలుగు దినపత్రికను బ్యాన్ చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెదరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడింది. వి6, వెలుగులో బీఆర్ఎస్ పార్టీ, లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలు, చేసిన ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిలకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య సూచించారు . కానీ, మీడియా ముఖంగా అల్టీమేటమ్ ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయనే సంగతి అందరికి తెలిసిందేనని గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా మాట్లాడం కేటీఆర్కు శోభనివ్వదని పేర్కొన్నారు. మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లు, మూక దాడులపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కేటీఆర్ ఖండించడాన్ని స్వాగస్తున్నట్టు చెప్పారు. పరిణితి చెందిన ప్రజానాయకుడిగా ఆయన చొరవను అభినందిస్తున్నట్టు వివరించారు. సమాజం కోసమే మీడియాకు పనిచేస్తుందనీ, అందుకే రాజ్యాంగం మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించిందని వివరించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి చట్ట ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న పత్రిక, ఛానెల్పై విమర్శలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వాలు విమర్శను స్వాగతించాలనీ, ఆమేరకు సర్కారులో ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం ఉండాలని కోరారు. రెండు రోజుల్లో పత్రికలు, ఛానెళ్లు విమర్శలు చేస్తూనే, మంచిని ప్రోత్సహించాలని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు వి6, వెలుగుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బి.బసవ పున్నయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TWJF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *