

- ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో బాంబ్ బ్లాస్ట్
- యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో బాంబు పేలుడు
- ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు.
- కనకయ్య, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికుల పరిస్థితి విషయం
- క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు.

యాదగిరిగుట్ట, జనవరి 4 (విశ్వం న్యూస్) : యాదగిరి గుట్టలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజిల్స్ రిపోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరో 18 మందికి గాయాలైనట్లు తెలిసింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఒకరి పేరు కనకయ్య అని తెలిసింది. ఆయన బచ్చన్నపేట వాసి.

యాదగిరిగుట్ట మండలం, పెద్ద కందుకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్సప్లొజివ్స్ కంపెనీ ఉంది. ఇందులో రియాక్టర్ పేలుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించింది.

భారీ శబ్దానికి చుట్టుపక్కల పెద్ద కందుకూరు గ్రామంలో ఉన్న ఇళ్లు కూడా ఊగడంతో అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చుట్టూ పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకున్నాయి.
