ఎలక్ట్రిక్-బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చెల్, జనవరి 4 (విశ్వం న్యూస్) :మేడ్చెల్ – బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగరంలోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
గమనించిన స్థానికులు ఘటనను వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
ప్రమాదం కారణంగా ఎవరికైనా గాయాలు అయ్యాయా, లేదా ప్రాణ నష్టం ఉందా అనే విషయాలు ఇంకా వెల్లడి కాలేదు.తాజా వివరాల కోసం వేచి చూడాలి.
