
హైదరాబాద్, జూలై 31 (విశ్వం న్యూస్) : శాసనమండలికి ఇద్దరు సభ్యులను కూడా ఎంపిక చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యానారాయణతో పాటు బలహీన వర్గాల బలమైన గొంతుగా ఉంటున్న దాసోజు శ్రవణ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈమేరకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్‌కు పంపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు.
