త్యాగ శీలి నాన్న… ప్రగతి సారథి నాన్న..

  • (జూన్ 18 న పితృ దినోత్సవం సందర్భంగా)

హైదరాబాద్, జూన్ 18 (విశ్వం న్యూస్) : మండే ఎండలో హాయిగా నీడని ఇస్తాడు.. జాతరలో భుజం మీద మోస్తూ.. తాను కష్టపడుతూ.. జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందుతాడు.. అంతేకాని.. కష్టం అంటూ ఎన్నటికీ వెనుకడుగు వేయడు తండ్రి.

ఓర్పు భూమి లాంటిది.. ఎత్తు ఆకాశం లాంటిది.. జీవితంపై కరుణతో దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు. పిల్లల ప్రతి బాధను తనపై తాను భరిస్తాడు నాన్న. ఆ దేవుని సజీవ ప్రతిమను మనం తండ్రి అని పిలుస్తాము. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

నాన్న నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
అన్న సినీ కవి మాటలు అక్షరసత్యాలు
మనల్ని తెలుసుకొని మసిలేది నాన్న
మన ఆశలు ఆకాంక్షలు తీర్చేది నాన్న
గురువు దైవం అన్నీ నాన్నే
నాన్న జీవధాత
నాన్న ఓర్పుకు అడ్డ
మార్పుకు మార్గదర్శి
నీతికి నిదర్శనం
మన ప్రగతికి సోపానo
అమ్మ ఒడి గుడి అయితే
నాన్న భుజం ఈ లోకాన్ని చూపే బడి
పేగు ఆమ్మదైతె పేరు నాన్నది
అమ్మ అనురాగం పంచుతే
నాన్న జీవిత అనుభవాలు చెబుతాడు
అమ్మ లాలి పాటలు
నాన్న నీతి పాటలు
ఉన్నత ఉజ్వల జీవితానికి
సోపానాలు
కష్టాలే తన ఇష్టాలుగా
మార్చుకొని
సంసార నావికుడై
కష్టాల కడలిని ఈదుతు
నిరంతరం పిల్లల సుఖం కోసం పరితపిస్తూ పరిశ్రమిస్తూ
ముళ్ల బాటలో నడుస్తూ
పిల్లలకు పూలబాట కోసం
త్యాగాల పునాదుల మీద
పిల్లల ఉజ్వల భవిష్యత్తు
నిర్మాత నాన్న
జీవితానికి గమనం
గమ్యం నిర్దేశకుడు నాన్న
దుఃఖాన్ని దిగమింగి
కుటుంబ సభ్యుల హితమే
తన అభిమతంగా మలుచుకున్న
కుటుంబ సంక్షేమ సారథి నాన్న
గురువై హిత బోధ చేస్తూ దైవంలా
ఆత్మవిశ్వాసాన్ని బిడ్డల్లో కలిగిస్తూ
భద్రత భరోసా రక్షణ కవఛమై
సరైన మార్గంలో నడిపించే నాన్న
పిల్లలు తనకంటే మించి ఉన్నత
శిఖరాలకు ఎదుగాలనే నాన్న
ఎప్పటికీ హీరోనే
వారసత్వ ప్రథాత పిల్లల ప్రగతి సారథి నాన్న
నాన్నను అర్థం చేసుకుందాం
ఆప్యాయతతో చూసుకుందాం
నాన్న ప్రేమ అనంతం
అజరామరం అద్బుతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *