రేవంత్ రెడ్డి కింద ఏ స్థాయికి ఈటెల, కౌశిక్ రెడ్డి సరిపోరు
- కేసీఆర్ చేసిన అక్రమాల్లో ఈటెలకు
భాగస్వామ్యం ఉంది - కేసీఆర్ ను దుయ్యబట్టే ఈటెల కేంద్రానికి కేసీఆర్ అక్రమాలపై ఎందుకు పిర్యాదు చేయట్లేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమాలు బయటకు వస్తే ఆ అక్రమాలలలో నా వాటా కూడా బయటకు వస్తుంది అని అందుకే ఈటెల కేంద్రానికి పిర్యాదు చేయట్లేదు అని ఆయన అన్నారు.
- ఈటెలను, కౌశిక్ రెడ్డిని ఏకి పారేసిన బల్మూరి వెంకట్
హుజురాబాద్, ఏప్రిల్ 23 ( విశ్వం న్యూస్ ) : ఈటెల తన ఉనికి కి ప్రమాదం ఏర్పడిందని తన ఉనికి కాపాడుకోవటానికి టి.పి.సి.సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై కావాలని చెత్తను అంట గడుతున్నాడని బల్మూరి వెంకట్ అన్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మోసకారి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అని అతని మాటలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలుసని ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షులు , హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బల్నురి వెంకట్ అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణం లో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తూ వారిని అక్కున చేర్చుకొని నిజమైన ఉద్యమ కారులకు ద్రోహం చేస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారిని మోసం చేసిన పెద్ద మోసగాడు అని అన్నారు.
ఎమ్మెల్యే ఈటెల హుజురాబాద్ ఎలక్షన్స్ లో గెలిచిన తరువాత నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని నియోజకవర్గ అభివృద్ధి ని గాలికి వదిలేసి మతిలేకుండా తిరుగుతున్నాడని
ఈటెల ను నమ్మి ఒట్లేసిన హుజురాబాద్ నియోకవర్గ ప్రజలను నట్టేట ముంచి తాను మాత్రం తన ఆస్తులను కాపాడుకోవటానికి తిరుగుతున్నాడని అన్నారు.
ఈటెల పై వచ్చిన ఆరోపణల పరిస్థితి ఎంటని ఎందుకు ఇప్పటివరకు ఈటలపై చర్యలు తీసుకుంటలేరని బీజేపీ , బిఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే అని బల్మూరి అన్నారు.
అధికార పార్టీ ప్రవేశ పెట్టిన పింఛన్లు తప్ప అన్ని స్కీమ్ లలో స్కాం లేదని చెప్పగలవా కౌశిక్ రెడ్డి ని ప్రశ్నించారు. పార్టీ లో ఉన్నపుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బందువని సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని టీఆరెఎస్ కు అమ్ముకున్నా డాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తారని ముందే గ్రహించి కేటీఆర్ ను కలిసింది నిజం కాదా అని అన్నారు. నిజంగా అభివృద్ధి కోసమే కౌశిక్ రెడ్డి టీఆరెఎస్ లో కి వచ్చాడా సమాధానం చెప్పాలి. కొండాపూర్ లో అంత పెద్ద ఇల్లు కౌశిక్ రెడ్డి కి ఎలా వచ్చిందో చెప్పాలి.
కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నపుడు నియోజవర్గంలోని మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డుల లో అభ్యర్థులను నిలుప చేతగాని కౌశిక్ రెడ్డి ఎందుకు నిలుప లేదో చెప్పాలి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పేరుతో కౌశిక్ రెడ్డి. తన కష్టమే ఇది అని హంగామా చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. అవగాహన లేని వారికి అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది అని ఈ సందర్భంగా ఎద్దేవా చేసారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాలను అడ్డుకోని చేత గాని ఎమ్మెల్యే ఈటెల, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అని ఆయన అన్నారు.
హుజురాబాద్ నియోకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలంగా నాటుకుపోతుందని వచ్చే ఎన్నికలలో నియోకవర్గ ప్రజలు బి.అర్.స్, బీ.జే.పీ లకు సరైన గుణపాఠం చెబుతారని బల్మూరి వెంకట్ ఒక వ్యక్తి కాదు శక్తి అని త్వరలోనే మీకు అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు , హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మురీ వెంకట్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ డి సి సి అధికార ప్రతినిధి సొల్లు బాబు కమలపుర్ మండల అధ్యక్షుడు చరణ్ పటేల్ ఓబీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుశీల టౌన్ మహిళ అధ్యక్షురాలు పుష్పాలత మైనారిటీ అధ్యక్షులు అప్సర్ సీనియర్ నాయకులు వెంకన్న, రాజేష్ , పోనుగంటి కిరణ్ రెడ్డి , అప్పాల రఘుపతి మధు , సంపత్, ప్రభాకర్ , మహిలా నాయకురాలు సునీత,లావణ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.