
- తెలంగాణ స్టేట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 17 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కరోనాకు ముందు, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ నియామకాలు కల్పించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని సంవత్సరాల నుండి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో చాలామంది ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు ఆరోగ్యాలు బాగోలేక ప్రభుత్వ ప్రైవేటు హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పరిస్థితిలో లేనప్పుడు అలాంటి సమయంలో తన కుటుంబంలో ఉన్న ఒకరికి ఉద్యోగం ఇప్పించుకోవడానికి ప్రభుత్వ హాస్పటల్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ పొంది మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్ పొంది ఆరు సంవత్సరాల ముందు రిటైర్మెంట్ కొరకు వారి వారి శాఖలలో సంబంధించిన అధికారులకు దరఖాస్తులు ఆ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు సమర్పించుకోవడం జరిగింది.
జిల్లా కలెక్టర్లకు ఆ శాఖలకు సంబంధించిన అధికారులు దరఖాస్తులు సమర్పించి సంవత్సరాలు కాస్తున్నప్పటికీ ఆయా జిల్లా కలెక్టర్లు కార్యాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టక వారికి సంబంధించిన దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్ ఉండటం వల్ల వారు పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో జీతాలు రాక వాలంటరీ రిటైర్మెంట్ కాకుండా వారి పిల్లలకు ఉద్యోగాలు రాక వారి కుటుంబంలో ఆ యొక్క ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారు.
కనుక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, చీఫ్ సెక్రటరీ చొరవ తీసుకోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలకు లేఖ రాయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల మానవత్వంతో ఆలోచించి వారికి సహాయం చేయడానికి ఆయా జిల్లా కలెక్టర్లు ముందుకు వచ్చి అలాంటి కుటుంబ సభ్యులకు సహకరించాలని వారికి సహాయం చేసిన వారి కుటుంబమే ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటారని, ఒక ఉద్యోగి అనారోగ్యాలపై ఆయా కలెక్టర్ కార్యాలయంలో చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నా యొక్క వాలంటరీ రిటైర్మెంట్ అయినట్లయితే నేను కూడా ఇబ్బంది లేకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని కాబోయే రిటైర్మెంట్ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు.
కనుక వారికి కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టి ఆ ఉద్యోగి ఇబ్బందులను తొలగించాలని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు