19న మడేలేశ్వరస్వామికి బోనాలు

19న మడేలేశ్వరస్వామికి బోనాలు

జమ్మికుంట, జూలై 17 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19 బుధవారం రోజున రజక కుల దైవం అయిన శ్రీ మడేలేశ్వరస్వామి దేవునికి బోనాల పండగ చేయడానికి నిర్ణయించడం జరిగింది అని పట్టణ అధ్యక్షులు వరగంటి సదానందం తెలిపారు.

ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ రజక కులం అందరు కుటుంబ సమేతంగా బుధవారం రోజున ఉదయం గం॥ 10-00 లకు గాంధీ చౌరస్తా నుండి బోనాలతో ఊరేగింపుగా వెళ్ళి మడేలేశ్వరస్వామికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. కావున రజక కులం అందరు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొనగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యక్షులు రాసాయల్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి రాము, కోశాధికారి బూరుగుపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *